హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

సింహాసనం వల్ల కలిగే ఉపయోగాలు

సింహాసనం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. గొంతు కండరాలు బాగా సాగుతాయి. గొంతు నొప్పి, టాన్సిల్స్, థైరాయిడ్ సమస్యలను అదుపులో ఉంచడానికి సహాయపడుతుంది. ముఖ కండరాలకు రక్తప్రసరణ బాగా జరిగి, ముఖంపై ముడతలు తగ్గి కాంతివంతంగా తయారవుతుంది. ఆసనం స్థితిలో కళ్లను పెద్దవిగా చేసి భ్రూమధ్యం (కనుబొమ్మల మధ్య) వైపు చూడటం వల్ల కంటి కండరాలు బలోపేతమై దృష్టి లోపాలు తగ్గుతాయి.