హైదరాబాద్: 28°C
తెలంగాణ

చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

KNR: కరీంనగర్ రూరల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ నెల 21న జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బల్మూరి శ్రీహరిరావు (68) చికిత్స పొందుతూ శనివారం మృతి చెందారు. తీగలగుట్టపల్లి–ఆరేపల్లి రహదారిపై కారు అదుపుతప్పి చెట్టును ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ సీఐ ఎ. నిరంజన్‌రెడ్డి తెలిపారు.