హైదరాబాద్: 28°C
తెలంగాణ

'అభివృద్ధి పనులను నాణ్యతతో పూర్తి చేయాలి'

KMM: ఖమ్మంలో చేపట్టిన అభివృద్ధి పనులను పర్యవేక్షణతో నాణ్యతతో పూర్తి చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. పనుల అమలులో నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదని, నిధులను పారదర్శకంగా వినియోగించాలని మంత్రి ఆదేశించారు. శనివారం ఖమ్మం 42వ డివిజన్లో రూ. 95.50 లక్షల వ్యయంతో చేపట్టనున్న రోడ్లు, సీసీ డ్రైన్ల నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు.