హైదరాబాద్: 28°C
తెలంగాణ

రెండు బైకులు ఢీ.. ఆరుగురికి గాయాలు

BHPL: మహాముత్తారం మండలం నిమ్మగూడెం మూలమ లుపు వద్ద శనివారం రెండు బైకులు ఢీకొన్న ఘటనలో ఆరుగురు గాయపడ్డారు. కనుకునూరుకు చెందిన సాయికుమార్, యానక రాజ్కుమార్, నిమ్మగూడెం చెందిన కృష్ణవేణి, సాహిత్య, ఏటూరునాగారం మండలం ములకట్టకు చెందిన రవీందర్, భాను ప్రకాష్ ప్రయాణిస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.