హైదరాబాద్: 28°C
తెలంగాణ

మూల్యాంకనం పారదర్శకంగా చేపట్టాలి: DEO

SRD: SA-1, SA-2 పరీక్షల జవాబు పత్రాలను ఎక్స్‌టర్నల్ విధానంలో మూల్యాంకనం చేయనున్నట్లు సంగారెడ్డి, జిల్లా విద్యాధికారి రోహిణి ఆదేశించారు. పరీక్ష పూర్తయిన వెంటనే జవాబు పత్రాలను సీల్ చేసి MRCకి అందించాలన్నారు. ఇతర పాఠశాలల ఉపాధ్యాయుల ద్వారా 3-5 రోజుల్లో మూల్యాంకనం పూర్తి చేసి ఆన్‌లైన్‌లో మార్కులు నమోదు చేయాలని, పారదర్శకత పాటించాలని స్పష్టం చేశారు.