హైదరాబాద్: 28°C
తెలంగాణ

భద్రకాళి అమ్మవారికి విశేష అలంకరణ

WGL: శ్రావణ మాసం ఆదివారం సందర్భంగా భద్రకాళి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. తెల్లవారుజామున అర్చకులు అమ్మవారికి విశేషాభిషేకాలు, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నూతన వస్త్రాలు, పుష్పాలతో అమ్మవారిని సర్వాంగసుందరంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. అమ్మవారి దర్శనం కోసం నగరంతోపాటు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు.