హైదరాబాద్: 28°C
తెలంగాణ

సెప్టెంబరు 2 నుంచి బీఆర్‌ఎస్ పోరుబాట: మాజీ ఎమ్మెల్యే

NLG: కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రవీంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. శనివారం దేవరకొండలో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ వైఫల్యాలు, మోసాలను ఎండగట్టేందుకు సెప్టెంబరు 2 నుంచి చేపడుతున్న వారం రోజుల పోరుబాటను విజయవంతం చేయాలని శ్రేణులకు పిలుపునిచ్చారు.