హైదరాబాద్: 28°C
తెలంగాణ

మట్టి వినాయకుడే ముద్దు.. పర్యావరణ పరిరక్షణే మన బాధ్యత

KMR: వినాయక చవితి పండుగను పర్యావరణ హితంగా జరుపుకోవాలని కోరుతూ సీసీఆర్ కామారెడ్డి ప్రతినిధి సభ్యుడు సుశీల్ కుమార్ అధికారులకు శనివారం వినతిపత్రాలు సమర్పించారు. బిచ్కుంద ఎస్సై జి. రాజుకు వినతిపత్రం అందజేసి, గ్రామాల్లో ఏర్పాటు చేసే వినాయక మండపాల నిర్వాహకులకు మట్టి విగ్రహాల వినియోగంపై అవగాహన కల్పించాలని కోరారు.