WGL: రాయపర్తి మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో 5వ తరగతి విద్యార్థిని బబ్లీ శనివారం సాయంత్రం పాము కాటుకు గురైంది. వెంటనే ఉపాధ్యాయులు ఆమెను వర్ధన్నపేట సీహెచ్‌సీకి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. కాటేసిన పామును విద్యార్థినులు కట్లపాముగా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తెలంగాణ
గురుకుల విద్యార్థినికి పాము కాటు


