హైదరాబాద్: 28°C
తెలంగాణ

నీట్-పీజీ పరీక్ష కేంద్రం వద్ద 144 సెక్షన్: ఎస్పీ

నల్గొండలో నేడు నిర్వహించనున్న నీట్-పీజీ పరీక్షను ప్రశాంత వాతావరణంలో జరిపేందుకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ శనివారం తెలిపారు. రామగిరి నేతాజీ నగర్‌లోని ఎస్పీఆర్‌ పాఠశాలలో కేంద్రం ఏర్పాటు చేశారు. ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పరీక్షా కేంద్రం చుట్టూ 200 మీటర్ల పరిధిలో 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు.