హైదరాబాద్: 28°C
తెలంగాణ

చేయూత పింఛన్లకు రేపటితో దరఖాస్తుల గడువు

KNR: చేయూత పథకంలోని ఏడు రకాల సామాజిక భద్రతా పింఛన్లకు దరఖాస్తు చేసుకునేందుకు ఆగస్టు 31 చివరి గడువని ఎంపీడీవో యాదగిరి తెలిపారు. శనివారం సైదాపూర్ మండల పరిషత్ కార్యాలయంలో అధికారులు, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులతో సమీక్షించారు. అర్హులైన వారు గడువులోగా దరఖాస్తు చేసుకునేలా ప్రజాప్రతినిధులు చొరవ చూపాలని సూచించారు.