హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఒకటో వార్డులో దోమల నియంత్రణకు ఫాగింగ్

ASF: ఆసిఫాబాద్ మున్సిపాలిటీ ఒకటో వార్డులో మున్సిపల్ అధికారులు దోమల నియంత్రణకు ఫాగింగ్ చేపట్టారు. దోమల వ్యాప్తిని అరికట్టడంతో పాటు ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ఫాగింగ్ నిర్వహించారు. కాలనీలోని వీధులు, పరిసర ప్రాంతాల్లో దోమల నివారణ మందును పిచికారీ చేశారు. ప్రజలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అధికారులు సూచించారు.