హైదరాబాద్: 28°C
తెలంగాణ

శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నీటి వివరాలు

NZB: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు (SRSP)లో ఆదివారం ఉదయం 6 గంటల వరకు నీటిమట్టం 1079.90 అడుగులుగా నమోదైంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి 1091 అడుగులు కాగా, ప్రస్తుతం 44.713 టీఎంసీల నీటి నిల్వ ఉంది. గతేడాది ఇదే సమయానికి 1084.90 అడుగుల నీటిమట్టంతో 59.502 టీఎంసీల నిల్వ ఉందని, గత 24 గంటల్లో 963 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో, 963 క్యూసెక్కుల ఔట్‌ఫ్లో నమోదైందనీ అధికారులు తెలిపారు.