హైదరాబాద్: 28°C
తెలంగాణ

MCA స్పాట్ అడ్మిషన్లు సెప్టెంబర్ 2న

KNR: శాతవాహన విశ్వవిద్యాలయ సైన్స్ కళాశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి MCA కోర్సులో స్పాట్ ప్రవేశాలు సెప్టెంబర్ 2న చేపట్టనున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్. రమాకాంత్ తెలిపారు. టీజీఐసెట్‌లో అర్హత పొందిన, పొందని అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఒరిజినల్ ధ్రువపత్రాలు, అవసరమైన ఫీజుతో కళాశాలకు హాజరుకావాలని సూచించారు.