హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: కాప్రా చెరువులో గణేష్ నిమజ్జనాలకు నో ఛాన్స్.!

MDCL: కాప్రా చెరువు పట్టణ చిత్తడి నేలగా గుర్తింపు పొందినందున గణేష్ నిమజ్జనాలకు అనుకూలం కాదని హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ తెలిపారు. చిన్న విగ్రహాల నిమజ్జనానికి సమీపంలోని బేబీ పాండ్‌ను వినియోగించుకోవాలని సూచించారు. పెద్ద విగ్రహాలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని ఉత్సవ కమిటీకి సూచించారు. 470కుపైగా వలస పక్షులకు కాప్రా చెరువు ఆవాసంగా ఉందని తెలిపారు.