హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడే నీట్ పరీక్ష.. సెంటర్ల వద్ద 163 సెక్షన్ ఆంక్షలు

SDPT: జిల్లాలోని రెండు కేంద్రాల్లో ఇవాళ జరిగే NEET-PG పరీక్షల నేపథ్యంలో సెక్షన్ 163 అమలు చేస్తున్నట్లు కలెక్టర్ హైమావతి తెలిపారు. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు ఇండోర్, వెరిటాస్ ఇంజినీరింగ్ కళాశాలల వద్ద ఐదుగురి కంటే ఎక్కువ మంది గుమిగూడటం నిషేధించినట్లు చెప్పారు. సెంటర్ల చుట్టూ 200 మీటర్ల పరిధిలోని జిరాక్స్ సెంటర్లు మూసివేయాలని స్పష్టం చేశారు.