హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఓటర్ల జాబితా సవరణ పారదర్శకంగా చేపట్టాలి'

NRML: ఓటర్ల జాబితా పరిశీలన,సవరణ,నోటీసుల జారీ, హియరింగ్ ప్రక్రియలను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ భవేష్ మిశ్రా అధికారులను ఆదేశించారు. అర్హత కలిగిన ఏ ఒక్క ఓటరు పేరు తొలగిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. నోటీసులను సంబంధిత ఓటర్లకు నేరుగా అందజేసి, వివరణలు, ధ్రువపత్రాలు సమర్పించేందుకు ఏడు రోజుల గడువు ఇవ్వాలన్నారు.