హైదరాబాద్: 28°C
తెలంగాణ

సోలార్ ప్లాంట్ కేబుల్ చోరీ.!

MDK: తూప్రాన్ పట్టణ శివారులోని సోలార్ ప్లాంట్‌లో 1000 మీటర్ల బీసీ కేబుల్ వైరు చోరీకి గురైనట్లు పోలీసులు తెలిపారు. తూప్రాన్ పట్టణ శివారు హైవే బైపాస్‌లోని చైతన్య రెడ్డి సోలార్ ప్లాంట్ నుంచి గుర్తు తెలియని వ్యక్తులు విలువైన కేబుల్ వైరు చోరీ చేయడంతో ప్లాంట్ ఎగ్జిక్యూటివ్ లోకేష్ ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.