మహబూబ్‌నగర్‌లో నేడు జరిగే NEET-PG–2026 పరీక్షకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. అదనపు కలెక్టర్ మధుసూదన నాయక్ సమీక్షించి పోలీస్, రెవెన్యూ, ఆర్టీసీ, వైద్య, విద్యుత్ శాఖలను సమన్వయం చేశారు. అభ్యర్థులను ఉదయం 7 నుంచి 8 గంటల వరకు అనుమతించి, 8:30 గంటలకు గేట్లు మూసివేయాలని ఆదేశించారు. అధికారులు సమన్వయంతో విధులు నిర్వహించాలని సూచించారు.
తెలంగాణ
నేడు నీట్-పీజీ పరీక్షకు పకడ్బందీగా ఏర్పాట్లు


