హైదరాబాద్: 28°C
తెలంగాణ

పీఎస్‌బీ బయోఫెర్టిలైజర్‌పై రైతులకు అవగాహన

WNP: రేవల్లి మండలం గౌరిదేవిపల్లిలో ఏటీఎంఏ ఆధ్వర్యంలో పీఎస్‌బీ బయోఫెర్టిలైజర్‌, నానో యూరియా వినియోగంపై రైతులకు అవగాహన కల్పించారు. మండల వ్యవసాయ అధికారి మణిచందర్‌ ఎరువుల వినియోగ విధానాన్ని వివరించారు. సిఫార్సు చేసిన మోతాదులో ఎరువులు వినియోగించి నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ సురేందర్‌రెడ్డి, అధికారులు, రైతులు పాల్గొన్నారు.