హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రముఖ రెస్టారంట్లపై అధికారుల దాడులు

HYD: సిటీలో ఫుడ్ సేఫ్టీ అధికారులు పలు ప్రముఖ రెస్టారెంట్లలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. అపరిశుభ్ర వాతావరణం, కుళ్లిపోయిన కూరగాయలు, గడువు ముగిసిన పదార్థాలను గుర్తించి ధ్వంసం చేశారు. 11 నమూనాలను ల్యాబ్‌కు పంపి నిర్వాహకులకు నోటీసులు జారీ చేశారు. నాణ్యతలో రాజీపడితే హోటళ్ల సీజ్, లైసెన్సుల రద్దుతో పాటు క్రిమినల్ కేసులు తప్పవని హెచ్చరించారు.