హైదరాబాద్: 28°C
తెలంగాణ

మెంటపల్లి రహదారి దుస్థితి

వనపర్తి మండలం మెంటపల్లికి వెళ్లే ప్రధాన రహదారి అధ్వానంగా మారింది. బురద, రాళ్లు, గుంతలతోపాటు వర్షపు నీరు నిలవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తారు రోడ్డు లేకపోవడంతో మట్టి రహదారి వర్షాలకు కొట్టుకుపోయి గుంతలు ఏర్పడ్డాయి. అధికారులు స్పందించి బీటీ రోడ్డు నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు.