హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: భక్తిమయంగా స్వామివారి ఊరేగింపు

GDWL: కేటీదొడ్డి మండలం వెంకటాపురంలో శనివారం రాత్రి శ్రీ పాగుంట లక్ష్మీ వేంకటేశ్వరస్వామివారి ఊరేగింపు భక్తిశ్రద్ధలతో కొనసాగింది. కృష్ణానది నుంచి తిరిగొస్తున్న స్వామివారిని పల్లకిలో భజనలు, బాజాభజంత్రీల నడుమ ఊరేగింపుగా తీసుకొచ్చారు. ఆడపడుచులు, చిన్నారులు కంచర్తులు పట్టుకుని భజనలు చేస్తూ పాల్గొన్నారు. దీంతో వెంకటాపురం వీధులు భక్తుల సందడితో భక్తిమయంగా మారాయి.