హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ప్లాస్టిక్‌ వ్యర్థాలతో నిండిన డ్రైనేజీ కాలువ

NGKL: అచ్చంపేట మున్సిపాలిటీ 13వ వార్డు వలపట్ల కాలనీలో డ్రైనేజీ కాలువ ప్లాస్టిక్‌ వ్యర్థాలతో నిండిపోవడంతో దుర్గంధం వ్యాపిస్తోందని స్థానికులు వాపోతున్నారు. పట్టణంలోని 20 వార్డుల మురుగు నీరు ఇదే ప్రాంతానికి చేరుతుండటంతో సమస్య తీవ్రంగా ఉందన్నారు. మున్సిపల్‌ సిబ్బంది స్పందించి డ్రైనేజీలోని ప్లాస్టిక్‌ వ్యర్థాలను తొలగించాలని స్థానికులు కోరుతున్నారు.