హైదరాబాద్: 28°C
తెలంగాణ

అచ్చంపేటలో నేటి ఎమ్మెల్యే పర్యటన వివరాలు

NGKL: అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ నేడు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఉదయం 6 గంటలకు ఐనోల్ గ్రామంలో మార్నింగ్ వాక్ నిర్వహించనున్నారు. 10 గంటలకు గువ్వలోనిపల్లి గ్రామంలోని శ్రీ రామచంద్రమూర్తి దేవాలయంలో ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 12.30కి అచ్చంపేటలో ఉపాధ్యాయుడు వెంకటేశ్వరశర్మ పదవీ విరమణ కార్యక్రమానికి హాజరవుతారు.