హైదరాబాద్: 28°C
తెలంగాణ

420 హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ విఫలం

KMM: రైతులు, మహిళలు, యువత, నిరుద్యోగులు, ఉద్యోగులు, పేదల సమస్యలను పట్టించుకోవడం లేదని మాజీ జడ్పీ ఛైర్మన్ లింగాల కమల్ రాజు విమర్శించారు. ముదిగొండ చిరుమర్రిలో నిర్వహించిన బీఆర్ఎస్ సమావేశంలో ఆయన శనివారం మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 420 హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని అన్నారు.