హైదరాబాద్: 28°C
క్రైమ్

దారుణం.. తల్లిపై కుమారుడి అత్యాచారం

ఉత్తరప్రదేశ్‌లో దారుణం చోటు చేసుకుంది. మద్యం మత్తులో కన్న తల్లిపైనే కుమారుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. హత్రాస్ జిల్లా సికంద్రరావు కొత్వాలి స్టేషన్ పరిధిలో.. ఓ మహిళ (63) తన ఇద్దరు కుమారులతో కలిసి జీవిస్తోంది. ఆగస్టు 27న ఆమె చిన్న కుమారుడు విజయ్ ఫుల్లుగా మద్యం సేవించి ఇంటికి వచ్చి.. నిద్రిస్తున్న తల్లి కాళ్లు చేతులు కట్టేసి, నోట్లో గుడ్డలు కుక్కి ఈ దారుణానికి పాల్పడ్డాడు.