హైదరాబాద్: 28°C
తెలంగాణ

అనుమతులు లేకుండా మట్టి తరలింపు.. లారీ సీజ్

SRCL: బోయినపల్లి మండలం వెంకట్రావుపల్లిలో అనుమతులు లేకుండా మట్టి తరలిస్తున్న లారీని పోలీసులు శనివారం సీజ్ చేశారు. బావుపేట నుంచి వెంకట్రావుపల్లికి మట్టి తరలిస్తున్న వాహనాన్ని విశ్వసనీయ సమాచారం మేరకు పట్టుకున్నట్లు ఎస్సై ఎన్.రమాకాంత్ తెలిపారు. డ్రైవర్‌ను విచారించగా యజమాని సూచనలతో మట్టి తరలిస్తున్నట్లు వెల్లడైనట్లు పేర్కొన్నారు.