హైదరాబాద్: 28°C
తెలంగాణ

అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం

మంచిర్యాల జిల్లా తాండూరు మండలానికి చెందిన అభినవ కల్చరల్ సోషల్ స్పోర్ట్స్ ఎడ్యుకేషనల్ అండ్ అగ్రికల్చర్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు కేశెట్టి సంతోష్ కుమార్‌కు అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం లభించింది. శనివారం పుదుచ్చేరిలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయనకు సామాజిక సేవలో గౌరవ డాక్టరేట్ ప్రదానం చేశారు. సంతోష్‌ను మండల ప్రజలు అభినందించారు.