హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఫీజు బకాయిలు విడుదల చేయాలి: బీజేపీ

ADB: నిరుపేద విద్యార్థులను ఆదుకోవడానికి ప్రభుత్వం వెంటనే ఫీజు రియంబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలని బీజేపీ నేత అరిగెల నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. శనివారం బీజేవైఎం ఆధ్వర్యంలో జరిగిన దీక్షలో ఆయన మాట్లాడారు. రూ.1,500 కోట్ల బకాయిలతో వందలాది కళాశాలలు మూతపడ్డాయని, పేద విద్యార్థులు చదువుకు దూరమవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.