GWDL: అయిజ మండలం ఈడిగోనిపల్లిలోని శివ రామాంజనేయ స్వామి ఆలయంలో శనివారం శ్రావణమాసం పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్సవ విగ్రహాన్ని పల్లకిలో ప్రతిష్ఠించి మహిళలు మంగళహారతులతో భాజా భజంత్రీలు, భజనల మధ్య దేవరమాను వరకు పల్లకీసేవ చేపట్టారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించి వర్షాలు సమృద్ధిగా కురవాలని గ్రామస్థులు వేడుకున్నారు.
తెలంగాణ
VIDEO: ఈడిగోనిపల్లిలో శ్రావణమాసం పూజలు


