హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నీట్‌–పీజీ పరీక్షకు పటిష్ట బందోబస్తు

GNTR: ఈ నెల 30న నిర్వహించనున్న నీట్‌–పీజీ ప్రవేశ పరీక్షకు గుంటూరు జిల్లాలో పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 6 పరీక్షా కేంద్రాల్లో 784 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్ష జరుగుతుంది.