హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

NEET-PG పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు

CTR: జిల్లాలో ఆగస్టు 30న నిర్వహించనున్న NEET-PG–2026 పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో నాలుగు పరీక్షా కేంద్రాల్లో 594 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నారు. పరీక్ష ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా పోలీసు బందోబస్తు, విద్యుత్, వైద్య, రవాణా, సైబర్ భద్రతా ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు.