హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉచిత బియ్యం గడువు పొడిగించండి: నాగునూరి

MNCL: జిల్లాలో 3 నెలల ఉచిత బియ్యం పంపిణీ గడువు ముగుస్తున్నా, ఇంకా అనేక మంది లబ్ధిదారులు తీసుకోలేదని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగునూరి వెంకటేశ్వర గౌడ్ పేర్కొన్నారు. దుకాణాల్లో నిల్వలు అలాగే ఉన్నాయని, ప్రజల సౌకర్యార్థం బియ్యం పంపిణీ గడువును మరో వారం రోజుల పాటు పొడిగించాలని కోరారు. ఈ మేరకు ఇవాళ జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్‌కు విజ్ఞప్తి చేశారు.