ATP: హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ పరిధిలోని జీడిపల్లి పంప్ హౌస్ నంబర్ 8 సమీపంలో కాలువకు గండి పడిందనే వార్తల్లో వాస్తవం లేదని ఎస్‌ఈ రాజగోపాల్ స్పష్టం చేశారు. ప్రస్తుతం 2,440 క్యూసెక్కుల నీరు వస్తుండగా 2,240 క్యూసెక్కులు పంపింగ్ చేస్తున్నట్లు చెప్పారు. కేవలం 200 క్యూసెక్కుల నీటిని ఎస్కేప్ ఛానల్ ద్వారా మళ్లించామన్నారు. అసత్య ప్రచారాలను నమ్మవద్దని కోరారు.
వార్తలు
హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ కాల్వకు గండి పడలేదు: ఎస్‌ఈ


