హైదరాబాద్: 28°C
తెలంగాణ

రైతులకు భూమి హక్కే ధైర్యం: మంత్రి

SRPT: నూతనకల్‌లో పట్టాదారు పాస్‌పుస్తకాల పంపిణీ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడారు. దశాబ్దాలుగా రైతులు ఎదుర్కొంటున్న భూ సమస్యలకు పట్టాలే పరిష్కారమన్నారు. రైతులకు భరోసా కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. తుంగతుర్తి నియోజకవర్గంలో రూ.100 కోట్లతో రోడ్లు మంజూరు చేశామని, మరో రూ.200 కోట్ల ప్రతిపాదనలు ఉన్నాయని వెల్లడించారు.