హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి: ఎస్పీ

కృష్ణా: నందివాడ పోలీస్ స్టేషన్‌ను ఎస్పీ విద్యాసాగర్ నాయుడు శనివారం సందర్శించారు. పెండింగ్ కేసులు, రికార్డుల నిర్వహణను ఎస్పీ పరిశీలించారు. ప్రజలకు మరింత మెరుగైన పోలీస్ సేవలు అందించాలని, ఫిర్యాదులపై వేగంగా స్పందించి చట్టపరమైన చర్యలు చేపట్టాలని పోలీస్ సిబ్బందికి సూచించారు. నేరాల నియంత్రణకు పటిష్టమైన చర్యలు తీసుకోవడంతో పాటు శాంతిభద్రతలను పరిరక్షించాలన్నారు.