హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

యువ చైతన్యంతోనే సమాజంలో మార్పు

VZM: యువతలో చైతన్యం పెంచి సమాజంలో మార్పు తీసుకురావాలనే లక్ష్యంతో పోలీసుల ఆధ్వర్యంలో గుర్లలో ‘యువ చైతన్యం’ కార్యక్రమం శనివారం నిర్వహించారు. SP దామోదర్ దిశానిర్దేశం చేస్తూ గంజాయి, మద్యం, బెట్టింగ్‌లకు దూరంగా ఉండాలని సూచించారు. సైబర్ మోసాలు, మహిళల భద్రత, రహదారి భద్రతపై అవగాహన కల్పించారు. నేరరహిత సమాజ నిర్మాణంలో యువత భాగస్వాములు కావాలన్నారు.