గుంతకల్లు కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయానికి శ్రావణమాసం మూడో శనివారం సందర్భంగా భక్తులు పోటెత్తారు. వేకువ జాము నుంచి అర్చకులు స్వామివారికి పవిత్ర గంగాజలాలు, పంచామృతాలతో అభిషేకించి శోభయమానంగా అలంకరించారు. భక్తులకు అన్ని సదుపాయాలు ఏర్పాటు చేశామని ఆలయ అధికారి మేడిపల్లి విజయరాజు తెలిపారు. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామిని దర్శించుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
కసాపురం ఆంజనేయస్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు


