హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అభివృద్ధికి వ్యాపారులు సహకరించాలి: ఎమ్మెల్యే

అన్నమయ్య: మదనపల్లె పట్టణంలోని సిటిఎం రోడ్డు విస్తరణ పనులను ఎమ్మెల్యే షాజహాన్ బాషా పరిశీలించారు. రోడ్డు అభివృద్ధికి స్థానిక వ్యాపారస్తులు సహకరించాలని ఆయన కోరారు. సిటిఎం రోడ్డు విస్తరణ పూర్తయితే మదనపల్లె పట్టణ రూపురేఖలు పూర్తిగా మారుతాయని ఎమ్మెల్యే తెలిపారు. అభివృద్ధి పనులకు సహకరిస్తున్న వ్యాపారస్తులకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.