హైదరాబాద్: 28°C
తెలంగాణ

మైనార్టీ యువతకు ఉచిత గ్రూప్స్‌ కోచింగ్‌

MBNR: మైనార్టీ వర్గాలకు చెందిన విద్యావంతులైన యువతకు గ్రూప్‌-1, 2, 3, 4 ఉచిత ఫౌండేషన్‌ కోచింగ్‌ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారులు తెలిపారు. సెప్టెంబర్‌ 1 నుంచి 14 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని, సెప్టెంబర్‌ 15 నుంచి తరగతులు ప్రారంభమవుతాయని వెల్లడించారు. మొత్తం 100 మందికి శిక్షణలో అవకాశం కల్పించనున్నట్లు చెప్పారు.