హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ముంపు గ్రామాల్లో సెప్టెంబర్ 1 నుంచి రేషన్

ప్రకాశం: వెలిగొండ ముంపు గ్రామాలైన కలనూతల, సుంకేసుల, గుండంచర్ల, గొట్టిపడియా రేషన్ కార్డుదారులకు సెప్టెంబర్ 1 నుంచి ప్రత్యేక కేంద్రాల ద్వారా రేషన్ బియ్యం, సరుకులు పంపిణీ చేయనున్నారు. ప్రజలు తమకు కేటాయించిన కేంద్రాలకు వెళ్లి రేషన్ పొందాలని జిల్లా కలెక్టర్ విజయ సునీత తెలిపారు. పంపిణీ ప్రక్రియను అధికారులు, సిబ్బంది పర్యవేక్షించనున్నారు.