NRPT: జిల్లా కేంద్రంలో ఆదివారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏఈ మహేశ్ గౌడ్ తెలిపారు. చిల్డ్రన్ ఆసుపత్రి, సివిల్ లైన్ ఫీడర్ల పరిధిలో ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు విద్యుత్ సరఫరా ఉండదని ప్రకటనలో పేర్కొన్నారు. గణేశ్ ఉత్సవాల సందర్భంగా మండపాలకు నిరంతర విద్యుత్ సరఫరా చేసేందుకు మరమ్మతులు చేస్తున్నామని, ప్రజలు సహకరించాలన్నారు.
తెలంగాణ
విద్యుత్ సరఫరాలో అంతరాయం


