హైదరాబాద్: 28°C
తెలంగాణ

రామగుండం పోలీసుల ఉత్తమ ప్రతిభ

PDPL: రాష్ట్రస్థాయిలో క్రైమ్ పారామీటర్ల అమలులో రామగుండం పోలీస్ కమిషనరేట్ ఉత్తమ ప్రతిభ కనబరిచింది. క్లస్టర్–II విభాగంలో రామగుండం పోలీస్ కమిషనరేట్ మొదటి స్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, మంచిర్యాల డీసీపీ ఏ.భాస్కర్‌కు డీజీపీ సీవీ ఆనంద్ ప్రశంసాపత్రాలు అందజేసి అభినందించారు.