హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సబ్ జైలులో ముద్దాయిలకు న్యాయమూర్తి అవగాహన

W.G: మత్తు పానీయాలు, మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటూ, కష్టపడి పనిచేసి సమాజంలో గౌరవంగా జీవించాలని తణుకు రెండో అదనపు మొదటి తరగతి జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కె. కృష్ణవేణి సూచించారు. తణుకు సబ్ జైలులో శనివారం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆమె పాల్గొని మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాలను వివరించారు.