హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆర్డీటీ సేవలు అభినందనీయం: కలెక్టర్

ATP: అనంతపురం ఆర్డీటీ కేంద్రంలో 22 మంది మహిళలకు కలెక్టర్ ఓ.ఆనంద్ ఆటో రిక్షాలను అందజేశారు. ఉపాధి లేని మహిళలకు నెల రోజులు డ్రైవింగ్, రహదారి భద్రత, ప్రథమ చికిత్సలో శిక్షణ ఇచ్చి వాహనాలు ఉచితంగా ఇవ్వడం శుభ పరిణామమన్నారు. ఐదు జిల్లాల పరిధిలోని 17 మండలాల బాధితులకు ఇవి ఎంతో ఉపయోగపడతాయని, ఆర్డీటీ సేవలు అభినందనీయమని కలెక్టర్ కొనియాడారు.