హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆలయ భూమిలో చర్చి నిర్మాణం

ప్రకాశం: కందుకూరు(M) ఓగూరు గ్రామంలో వరదరాజస్వామి ఆలయ భూమిలో జరుగుతున్న చర్చి నిర్మాణాన్ని శనివారం మండల తహసీల్దార్ మురళి, ఆలయ EO కార్తీక్, పంచాయతీ కార్యదర్శి పరిశీలించారు. చర్చి నిర్మాణ పనులను ఆపాలని రెవెన్యూ అధికారులు ఆదేశించినా పనులు కొనసాగించడంతో స్థానికులు ఆందోళన చేశారు. దాంతో అధికారులు ఓగూరు చేరుకుని పరిస్థితిని పరిశీలించారు.