NZB: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా హియరింగ్ నోటీసుల పంపిణీని వేగవంతం చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ భవేష్ మిశ్రా అధికారులను ఆదేశించారు. నిజామాబాద్ జిల్లాలో 4,32,401 నోటీసులు సిద్ధం చేయగా ఇప్పటివరకు 56,678 మందికి అందజేసినట్లు తెలిపారు. రోజూ గరిష్ఠ సంఖ్యలో నోటీసులు పంపిణీ చేసి, అక్నాలెడ్జ్‌మెంట్ తప్పనిసరిగా పొందాలని సూచించారు.
తెలంగాణ
నోటీసుల పంపిణీ వేగవంతం చేయాలి: కలెక్టర్


