హైదరాబాద్: 28°C
తెలంగాణ

తాడికల్‌లో ఘనంగా పోచమ్మ బోనాలు

KNR: తాడికల్ గ్రామంలో పోచమ్మ బోనాల వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. మహిళలు బోనాలు ఎత్తుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. శివసత్తుల పూనకాలు, డప్పు చప్పుళ్లతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. పాడిపంటలు సమృద్ధిగా పండాలని, ప్రజలకు ఆయురారోగ్యాలు కలగాలని అమ్మవారిని ప్రార్థించారు. మహిళలు, పిల్లలు, పెద్దలు, గ్రామస్థులు పాల్గొన్నారు.