హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: గజ స్థంభం స్థాపనకు ఏర్పాట్లు

SRD: కంగ్టి మండల కేంద్రంలోని శ్రీ సిద్దేశ్వర స్వామి ఆలయం ఎదుట నూతన గజస్తంభం స్థాపనకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. శనివారం గజ స్తంభానికి వేద బ్రాహ్మణులు వేదమంత్రోచ్ఛారణల మధ్య విశేష పూజా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా గజ స్తంభానికి భక్తులు పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. రేపు ఆదివారం గ్రామస్తుల ఆధ్వర్యంలో స్థాపన జరగనుంది.